Why Lightning occurs? (in Telugu) పిడుగులు ఎందుకు పడతాయి?
పిడుగులు... ఇవి ఆకాశంలో మెరిసేటప్పుడు ఎంత అద్భుతంగా కనిపిస్తాయో, పడేటప్పుడు అంత భయంకరంగా ఉంటాయి. ఒక్క భారతదేశంలోనే ఏటా సుమారు వేయి మందికి పైగా పిడుగుల బారినపడి మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకూ, కనీసం వంద పిడుగులు నేలపై పడుతూ ఉంటాయి. ఐతే, పిడుగులు ఎందుకు పడతాయి, ఎలాంటి ప్రదేశాల్లో పడతాయి, వీటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పిడుగు, లేదా LIGHTNING అనేది మేఘాల నుండీ భూ ఉపరితలాన్ని తాకే అతి శక్తివంతమైన విద్యుత్ ప్రవాహం. మేఘాల నుండీ విద్యుత్ ఎలా పుడుతుందని మీరు సందేహపడొచ్చు. సాధారణంగా వాతావరణం చల్లబడినప్పుడు, మేఘాలలో ఉన్న నీరు ద్రవ ఇంకా ఘన పదార్థాలగా మారుతుంది. వీటికి బలమైన గాలులు తోడైనప్పుడు, నీరు ఇంకా మంచు బిందువులు మధ్య రాపిడి ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన రాపిడి వల్ల, మేఘాలలో కొన్ని వేల కోట్ల పాజిటివ్ ఇంకా నెగటివ్ ఛార్జ్ లు స్తృష్టించబడతాయి. ఈ పాజిటివ్ ఇంకా నెగటివ్ ఛార్జ్ లు ఒకదానిని మరొకటి ఆకర్షించుకున్నప్పుడు అమితమైన విద్యుత్ శక్తి ఇంకా వేడి పుడుతుంది. దీన్నే పిడుగు, లేదా LIGHTNING అని పిలుస్తారు. ఒక్కో పిడుగు సమారు 30 కోట్ల వోల్...