Posts

Showing posts from 2023

Yureka Luck O Reka (Telugu Rock Song) - Ram Prasad K S V N S

Image
Wishing you all, a #HappyNewYear2024 Here is the Rocking #YurekaLuckOReka dedicated to all of you for giving me an amazing 2023. Song Name: Yureka Luck O Reka Release Date: 31st December 2023 Language: Telugu Composer: Ram Prasad K S V N S Lyrics: Ram Prasad K S V N S Singer: Ram Prasad K S V N S

What is Love? Why do we love someone? Meaning of Love (in Telugu) • 'ప్రేమ' అంటే ఏమిటి?

Image
ఈ భూమిమీద ఉండే ఏ జీవికైనా ఎమోషన్స్ ఉంటాయని మనం నమ్ముతాం. అంటే సంతోషం, దుఃఖం, బాధ, కోపం, జాలి, ఇలాంటివి... అయితే అన్ని జీవరాశులలోనూ కామన్ గా కనిపించే ఒక అందమైన ఎమోషన్... ప్రేమ... ప్రేమించడం మనకి తెలుసు. అందరూ ఒకేలా ప్రేమించక పోవచ్చు, బట్ ప్రేమించడంలో ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది.ఒక వ్యక్తిని ఎంతలా  ప్రేమిస్తామో చెప్పగలం కానీ ఎందుకు ప్రేమిస్తామో కచ్చితంగా  చెప్పలేం! సైకాలజీ ప్రకారంగా ప్రేమ యొక్క లోతుల్ని తెలుసుకొని, అసలు ఒకరిపై ఒకరికి ప్రేమ అనేది ఎందుకు పుడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం... సింపుల్ గా చూసినప్పుడు, ప్రేమ అనేది ఇద్దరు వేరువేరు మనుషులని, వారి మనసులని ఏకం చేస్తుంది... కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, ఈ ప్రకృతిలో ఎలాంటి జీవైనా తన జీవితంలో వేరొక జీవిని ప్రేమిస్తుంది. ఇంత అనంతమైన ప్రకృతితో పాటూ ఇందులో మనం చూసే అనేక కోట్ల జీవరాశులు పుట్టడానికీ, కలిసి జీవించడానికీ గల కారణం kuda ప్రేమే... ఒక జీవికి మరొక జీవి పరస్పరం సహాయపడేలా చేస్తూ, జీవితంలో కష్టాలనూ, బాధలనూ ఓర్చుకొని ముందుకు సాగగలమనే ధైర్యాన్ని ఇచ్చే గొప్ప సాధనమే ప్రేమ... అయితే, ప్రేమకు షరతులు లేవు... ఎవరైనా,...

Naatho Vacchey (Telugu Lyrical Song) - Ram Prasad K S V N S

Image
  Song Name: Naatho Vacchey (Telugu) Composer: Ram Prasad K S V N S Release Date: 22 October 2023 Telugu Love Songs | Telugu Melody Songs | Telugu Movies | Telugu Lyrics | Telugu

What is Reserve Bank of India? (in Telugu) • భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పనులు ఏమిటి?

Image
రూపాయి... ఇది మనం బ్రతకడానికి ఉపయోగపడే ఒక కాగితపు నోటు మాత్రమే కాదు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా పేరు గడించిన మన Indian ఎకానమీకి కూడా ప్రాణమని చెప్పవచ్చు.  అయితే, మనకి ప్రతి విషయంలోనూ అవసరమైన ఈ రూపాయిని దేశ నలుమూలలకీ ప్రవహింపచేసి మన ఆర్ధిక వ్యవస్థను బ్రతికించే గుండెకాయ ఏంటో తెలుసా? అదే RBI, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... భారతదేశంలో ఉండే బ్యాంకులన్నిటికీ రారాజు.  మన చేతిలోకి వచ్చే ప్రతి కరెన్సీ నోటు పైనా, ఈ బ్యాంకు పేరుని చూడొచ్చు. RBI యొక్క స్ట్రక్చర్, దాని పనితీరు, ఇంకా అది మన దేశ ఆర్ధిక వ్యవస్థ నిర్మాణానికి ఏ విధంగా తోడ్పడుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం... భారతదేశంలో జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ కేవలం రూపాయి కరెన్సీలో జరుగుతాయి. లావాదేవీలు జరపడానికి అవసరమైన కరెన్సీ నోట్లనూ, చిల్లర కాసులనూ RBI ముద్రిస్తుంది. ఇంటర్నెట్ ఆధారిత డిజిటల్ లావాదేవీలను కూడా RBI పర్యవేక్షిస్తుంది.  Reserve Bank Of India లేదా RBI 1935 లో స్థాపించబడింది. దీని ముఖ్య ఉద్దేశం, భారతీయ ఆర్ధిక వ్యవస్థని విజయవంతంగా నడిపించడం. భారతదేశంలో ఉండే అన్ని బ్యాంకులు RBI పర్యవేక్షణలోనే ఉంటా...

What is Buddhism? (Explained in Telugu) • బౌద్ధ తత్వం ఏం చెబుతోంది?

Image
బౌద్ధ మతం లేదా buddhism ప్రస్తుతం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద మతాచారంగా గుర్తింపు పొందింది. సుమారు 52 కోట్ల మంది బౌద్ధ మత సూత్రాలను అనుసరిస్తున్నారు. బౌద్ధ మతం అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది, ధ్యానంలో ఉండే గౌతమ బుద్ధుని నిర్మలమైన స్వరూపం... మనం బౌద్ధ మతం గురించి, ఆ మతం ప్రపంచానికి ఇస్తున్న సందేశం గురించీ తెలుసుకోబోయే ముందు 'ధర్మం' అనే శబ్దానికి అర్ధాన్ని తెలుసుకోవాలి.  ధర్మం అంటే మన ముందు ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు, వాటిలో సరైనదాన్ని ఎలా ఎన్నుకోవాలో తెలుసుకోవడం. ఏ ఒక్కరికీ హాని కలిగించని సరైన నిర్ణయాలు తీసుకోవడం.  ధర్మాన్నే ఆధారంగా చేసుకొని నిరాడంబరమైన జీవితాన్ని లేదా simple లైఫ్ ని అనుసరించమని తెలిపే మతమే బౌద్ధ మతం. బౌద్ధ ధర్మం, ధర్మ వినయం, buddhism.. ఇలా ప్రస్తుతం మూడు  పేర్లతో ఈ మతం ప్రపంచమంతా వ్యాపించింది...  బౌద్ధ ధర్మం భారతదేశానికి చెందిన ఒక ప్రాచీనమైన మతం. ఇది పూర్తిగా గౌతమ బుద్ధుడు అనే మహా జ్ఞాని చేసిన హితబోధల ఆధారంగా స్థాపించబడింది.  'బుద్ధ' అనే పదానికి అర్ధం.. జ్ఞానం. బౌద్ధ మతం పూర్తిగా జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. బౌద్ధ ధర్మం ప్రకారం, ఈ ప్రపం...

What is Union Territory? (in Telugu) • యూనియన్ టెర్రిటరీ / కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఏమిటి?

Image
కేంద్రపాలిత ప్రాంతాలు లేదా యూనియన్ టెర్రిటరీలనేవి భారతదేశంలో ఒక ప్రత్యేక పరిపాలనా విభాగాలు. భారత దేశంలో ఒకానోక ప్రాంతంలో ఉండే స్థానిక సంస్కృతి లేదా సున్నితమైన అంశాలను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతానికి యూనియన్ టెర్రిటరీ అనే స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. భారతదేశ భూభాగం మొత్తం వివిధ రాష్ట్రాలు, ఇంకా యూనియన్ టెర్రిటరీలుగా విభజించబడింది. అయితే, రాష్ట్రాలు లేదా states కి వాటి సొంత ప్రభుత్వాలు ఉంటాయి. కానీ యూనియన్ టెర్రిటరీలకు మాత్రం సొంత ప్రభుత్వ పాలన అనేది ఉండదు. ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం లేదా యూనియన్ గవర్నమెంట్ పరిపాలనలో ఉంటాయి. యూనియన్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ పాలనలో ఉండటం మూలాన ఆ ప్రాంతాలకి యూనియన్ టెర్రిటరీలన్న పేరు వచ్చింది. ఈ ప్రాంతాలు సాధారణంగా president of India లేదా రాష్ట్రపతి పాలనలో ఉంటాయి. 2022 నాటికి భారతదేశంలో మొత్తం 9 యూనియన్ టెర్రిటరీలు ఉన్నాయి. 1. Andaman and Nicobar islands, 2. Chandigarh 3. Dadra and nagar Haveli 4. Daman and Diu 5. Delhi 6. Jammu and Kashmir 7. Ladakh 8. Lakshadweep islands, ఇంకా  9. Puducherry Andaman Nicobar దీవులు, ఇంకా లక్షద్వ...