top of page

What are Hormones? (in Telugu) హార్మోన్స్ అంటే ఏమిటి?

  • Writer: Ram Prasad K S V N S
    Ram Prasad K S V N S
  • Jul 11
  • 2 min read

Updated: Aug 22

మానవ శరీరం వివిధ రసాయనాలు, లేదా CHEMICALS తో తయారైన ఒక వ్యవస్థ..


ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నపప్టికీ ఏ ఇద్దరి శరీరాలు, ఆరోగ్యం ఒకే రకంగా ఉండవు..


ఒక మనిషి యొక్క రూపూ, బరువూ, ఆరోగ్యం దేనిమీద ఆధారపడి ఉంటాయి?


స్త్రీ పురుషుల యొక్క శారీరక పెరుగుదల ఎందుకు విభిన్నంగా జరుగుతుంది?


వీటిని అర్థం చేసుకోవాలంటే మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ అనే వాటి గురించి తెలుసుకోవాలి..


హార్మోన్స్ అంటే ఏంటి? శరీరంలో అవి ఏవిధంగా పనిచేస్తాయి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం...



మానవ శరీరం జీవించడానికి గాలి, నీరు, ఆహారం వంటివి తీసుకొని, వాటి ద్వారా శక్తిని గ్రహిస్తుంది.


అదే విధంగా ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర, శారీరక శ్రమ, మానసిక ఆనందం అనే వాటిని కూడా పొందుతుంది.


ఈ మొత్తం ప్రక్రియను జీవక్రియ లేదా METABOLISM అని అంటారు.


జీవక్రియ ను నియంత్రించడానికి శరీరంలోని అవయవాలు హార్మోన్స్ అనే జీవ రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.


హార్మోన్స్ శరీరావయవాలలో ఉండే వివిధ గ్రంధుల ద్వారా విడుదల అవుతూ ఉంటాయి.


శరీర పెరుగుదలకు, అవయవాల అభివృద్ధికి, సంతానోత్పత్తికి హార్మోన్స్ ఎంతో అవసరం.


శరీరంలో జరిగే ఒక్కో చర్యను ఒక్కో హార్మోన్ నియంత్రిస్తూ ఉంటుంది.


కొన్ని ముఖ్యమైన హార్మోన్లు, వాటి పనితీరు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


మొదటిది, థైరాయిడ్ హార్మోన్ (THYROID HORMONE)..


ఇది గొంతు భాగం దగ్గర ఉండే థైరాయిడ్ గ్రంధి, లేదా THYROID GLAND నుండీ విడుదల అవుతుంది.


థైరాయిడ్ హార్మోన్ అతి ముఖ్యమైనది. ఇది శరీరంలో జరిగే జీవక్రియలన్నిటినీ దాదాపుగా నియంత్రిస్తుంది.


శరీర బరువు, శక్తి, ఇంకా ఉష్ణోగ్రత స్థాయిలు కూడా ఈ హార్మోన్ నియంత్రణ లోనే ఉంటాయి..


రెండోది, ఇన్సులిన్ హార్మోన్ (INSULIN)...


ఇది కడుపు వెనుకభాగంలో ఉండే క్లోమం, లేదా PANCREAS అనే గ్రంధి నుండీ విడుదలవుతుంది.


ఇన్సులిన్ హార్మోన్ ఆహారపదార్థాల నుండీ లభించే గ్లూకోస్ ను అన్ని అవయవాలకు చేరేలా చేసి, శరీరం శక్తిని పొందడంలో సహాయపడుతుంది..


దీనితో పాటూ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని కూడా నియంత్రిస్తూ ఉంటుంది.


ఇన్సులిన్ హార్మోన్ పనితీరులో సమస్యలు వస్తే, ఆ పరిస్థితినే మధుమేహ వ్యాధి, లేదా షుగర్ వ్యాధి అని పిలుస్తారు.


మూడోది, అడ్రినలిన్ (ADRENALINE)...


ఈ హార్మోన్ అడ్రినలిన్ గ్రంధి నుండీ విడుదల అవుతుంది.


అడ్రినలిన్ ఆపద సమయాల్లో పనిచేసే హార్మోన్. ఒక వ్యక్తి భయపడినప్పుడు, లేదా తీవ్ర వొత్తిడిలో ఉన్నప్పుడు వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.


శరీర కండరాలన్నిటికీ వేగంగా రక్త ప్రసరణ జరిగేలా చేసి, తద్వారా అవి వేగంగా ప్రతిస్పందించేలా చేస్తుంది.


నాల్గవది, గ్రౌత్ హార్మోన్ (GROWTH HORMONE)...


ఇది మెదడులో ఉండే పిట్యూటరీ గ్రంధి / PITUITARY GLAND నుండీ విడుదల అవుతుంది.


గ్రౌత్ హార్మోన్ శరీర పెరుగుదల, కణాల ఉత్పత్తి, గాయాల మాన్పు వంటి చర్యలను నియంత్రిస్తుంది.


ఐదవది, టెస్టోస్టిరాన్ (TESTOSTERONE)...


ఇది పురుషులకు సంబంధించిన సెక్స్ హార్మోన్. ముఖ్యంగా కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది.


టెస్టోస్టిరాన్ వృషణాలు, లేదా TESTES నుండీ విడుదల అవుతుంది.


ఇది పురుషుల పునరుత్పత్తి అవయవాలను అభివృద్ధి చేస్తుంది. మీసాలు, గడ్డం, ఇంకా ఇతర రోమాలు పెరిగేలా చేస్తుంది.


పురుషులలో టెస్టోస్టిరాన్ స్థాయి ఉండాల్సిన దానికంటే తగ్గితే ఎముకల బలహీనత, కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి.


ఆరవది, ఈస్ట్రోజెన్ (ESTROGEN)...


ఇది స్త్రీలకు సంబంధించిన సెక్స్ హార్మోన్. అండాశయాలు, లేదా OVARIES నుండీ విడుదల అవుతుంది.


స్త్రీల యొక్క ఋతుక్రమం, సంతానోత్పత్తి, ఇంకా మెనోపాజ్ వంటి చర్యలను నియంత్రిస్తుంది.


శరీరంలోని ఈస్ట్రోజెన్ స్థాయి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే, అది బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీస్తుంది.


అదే ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటే, చర్మం ముడతలు పడటం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి.


ఏడవది, ప్రాజెస్టిరాన్ (PROGESTERONE)...


ఇది స్త్రీలకు సంబంధించిన మరో సెక్స్ హార్మోన్. ఇది అండాశయాలు, ఇంకా అడ్రినలిన్ గ్రంధుల నుండీ విడుదల అవుతుంది.


స్త్రీలు గర్భం దాల్చినప్పుడు వారి శరీరంలో జరిగే మార్పులను ప్రాజెస్టిరాన్ నియంత్రిస్తుంది.


ఎనిమిదవది, సెరొటోనిన్ (SEROTONIN)...


ఇది భావోద్వేగాలను పెంచే హార్మోన్. దీన్ని ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు.


ఇది సహజంగా మెదడు ద్వారా శరీర నరాలనుండీ విడుదల అవుతుంది.


ఆలోచనలు, భావాలు, నిద్ర, జీర్ణ వ్యవస్థ వంటి చర్యలను సెరొటోనిన్ నియంత్రిస్తుంది.


సెరొటోనిన్ హార్మోన్ పనితీరులో సమస్యలు ఉంటే, అది డిప్రెషన్, మైగ్రేన్, చిరాకు, ఊబకాయం వంటి శారీరక మానసిక సమస్యలకు దారి తీస్తుంది.


ఈ రకంగా హార్మోన్లు మన శరీరంలో జరిగే సంక్లిష్టమైన చర్యలను మన ప్రమేయం లేకుండానే నియంత్రిస్తూ ఉంటాయి.


శరీరంలో హార్మోన్లు సమతుల్యతను కోల్పోయినప్పుడు, లేదా HORMONAL IMBALANCE ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

*sponsored

1.png
2_edited.jpg

*sponsored

1.png
2_edited.jpg

*sponsored

1.png
2_edited.jpg

Ram Prasad K S V N S Recommends

Product Reviewer and Online Shopping Consultant,

Call us on +919949705167

Mail: contact@ramprasadksvns.com

  • Instagram
  • Youtube
  • Whatsapp

Disclaimer: Some of the links on this blog are affiliate links from Amazon India. That means if you click and buy something, I may earn a small commission at no extra cost to you.

These recommendations are personally handpicked to help students, teachers, and young creators make smarter and more productive choices.

Thank you for supporting "Ram Prasad K S V N S Recommends"! ❤️

Ram Prasad K S V N S Logo | Online store

Subscribe to our newsletter

bottom of page