Karma Yoga (in Telugu) కర్మయోగం
ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు తమ దగ్గర లేని వాటిలో సంతోషం వెతికితే, మరొకరు తనదగ్గర ఉన్నవాటితో సంతోష పడతారు.
ఆశ... ఈ సమాజంలో జరిగే ప్రతిదానికీ కారణం.
అలాగని నువ్వు దేనిమీదా ఆశ పడనంత మాత్రాన సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తుందని నేను చెప్పలేను.
నువ్వు ఎప్పుడు పుట్టావ్, ఎక్కడ ఉన్నవ్, ఎలా బ్రతుకుతున్నావ్... అన్నీ ప్రకృతే నిర్ణయించింది.
ఇది ఒక పోరాటం. నీ బ్రతుకు కోసం నువ్వు చేసే ఒక పోరాటం...
నీ పోరాటం మీద ధ్యాస పెట్టు. కొరికలమీద కాదు..
నువ్వు పోరాడాలి.. నీ బ్రతుకు కోసం పోరాడాలి..
నువ్వు బ్రతకాలి.. నీ సమస్యలు తట్టుకోవడానికి బ్రతక్కలి..
నువ్వు పోరాడేది నిన్ను నువ్వు బలంగా తయారు చేసుకోవడానికని గుర్తుపెట్టుకో..
నువ్వు కావలసినంత బలంగా తయారైనప్పుడు ఎంతో ఉన్నతంగా బ్రతకగలవు... ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలవు.
కాబట్టి, ఈ ప్రకృతితో కలసి పోరాడు.
ప్రకృతిని నువ్వు అర్థం చేసుకోగలిగినప్పుడు అది నీ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది.
నీ పోరాటంలో నీకు సహాయపడుతున్న ప్రతిదానికీ నువ్వు కృతజ్ఞత చూపించు.
ఈ పోరాటంలో నీకు అవసరమైన ప్రతీదీ నీకు అందుతుంది... వాటిని వద్దనకుండా తీసుకో..
నీ బ్రతుకు పట్ల, నీ పోరాటం పట్ల మాత్రమే దృష్టి పెట్టు.
నీ కష్టం వృధాగా పోదు. నిరంతరం నిన్నది రక్షిస్తుంది.
నీ ఇష్టాలు, కోరికలు, బంధాలు, శాశ్వతం కాదని తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ పోరాటం సులువుగా మారుతుంది.
మూడు పూటలా కడుపునిండా తినడానికి నువ్వు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు, ఏ పని మీదా దృష్టి పెట్టలేవు.
భూమి, నీరు, గాలి, ప్రకృతి.. ఎవరి సొంతం కాదు.. వీటికి హాని తలపెట్టాలనుకునేవాళ్ళు ఎవరైనా చివరికి నాశనమైపోతారు..
ప్రకృతికి అనుకూలంగా ప్రవర్తించు. అది నీకు సహాయపడుతుంది.
నీ సుఖానికైనా దుఃఖానికైనా నీ సొంత ప్రవర్తనే కారణమన్న విషయాన్ని గుర్తుపెట్టుకో...
నీ దుఃఖాలకు కారణాన్ని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు, నీకు దుఃఖమనేదే ఉండదు.
కాబట్టి, నీ సమస్యలనుండి తప్పించుకోడానికి మాత్రం ప్రయత్నించకు...
దేన్నైనా ధైర్యంగా ఎదురించి నిలబడు... దీనివల్ల నీకు పోయేదేమీ లేదు.
నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించినప్పుడు, చావు కూడా నిన్ను బాధపెట్టదు.
నువ్వు ఆదర్శవంతంగా నిలిచినప్పుడే కదా, నీ బాధ్యతలను ఇంకొకరు తీసుకుంటారు??!
నీ సమస్యలనే నువ్వు పరిష్కరించుకోలేనప్పుడు, నిన్ను నమ్ముకున్నవాళ్ళ పరిస్థితి ఏమవుతుందో కాస్త ఆలోచించు.
నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే, మిగతావాళ్ళ కన్నీళ్లు నువ్వు తుడలేవు.
ఒకరి స్వభావాన్ని, ఆలోచనని నువ్వు మార్చలేవు.. ఎవరైనా తమని తాము మార్చుకోవాల్సిందే..
నీతో ఉన్నవాళ్ళందరు నీతోనే ఉండాలని అనుకోకు.. ఎవరి దారి వాళ్ళది.. ఎవరి బాధ్యతలు వాల్లవి..
ఎవరూ నువ్వనుకున్నట్లు ఉండరు.... ఏదీ నువ్వానుకున్నట్లు ఉండదు..
ఈ నిజాన్ని తెలుసుకున్నవాళ్లంతా ఒకరకంగా ప్రవర్తిస్తారు.. తెలియలేనివాళ్ళు మాత్రమే గర్వంతోను, భయంతోనూ బ్రతకడానికి ప్రయత్నిస్తారు..
ధైర్యంగా ముందుకు సాగు మిత్రమా.. నువ్వు గెలిచినా ఓడినా నీ వాళ్లు ఎప్పటికీ నిన్ను గుర్తుంచుకుంటారు.
నువ్వు త్యాగం చేసిన ప్రతీదీ మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది..
ఈ అనంతమైన విశ్వం, అనంతమైన కాలం, నీకు గొప్ప శక్తిని అందించాయి.
నీ శరీరం కంటే గొప్పగా నీకు సహకరించేది ఈ ప్రపంచంలో మరెక్కడా ఉండదు.
నీ మనసు కంటే బాగా నీ కష్టాలను అర్థం చేసుకునేది మరేదీ లేదు.
మనసుపెట్టి ఆలోచించు.. నువ్వెలుతున్న దారి సరైనదా కాదా అని..