Types of Unemployment & Causes of Unemployment (in Telugu) • నిరుద్యోగ సమస్య ఎన్ని రకాలు?

ఒక వ్యక్తి తగినంత విద్యార్హత, నైపుణ్యాలు కలిగి ఉండి కూడా, కోరుకున్న ఉద్యోగం లేదా పని సంపాదించుకొలేకపోతే... ఆ వ్యక్తిని నిరుద్యోగి అని అంటారు..

భారత దేశంలో నిరుద్యోగం లేదా UNEMPLOYMENT RATE 2019 ఫిబ్రవరి నాటికి 7.2 శాతం పెరిగింది.

మన దేశంలో నిరుద్యోగులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు.. ఇది ఇలా కొనసాగితే, దేశ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉంది. 

నిరుద్యోగం పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే వాటి గురించి తెలుసుకునే ముందు, భారతదేశంలో నిరుద్యోగం ఎన్ని రకాలుగా ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..



భారత దేశంలో నిరుద్యోగ సమస్య 10 విధాలుగా ఉందని చెప్పవచ్చు..

1. OPEN UNEMPLOYMENT

గొప్ప విద్యార్హతలు, నైపుణ్యం కలిగిన అధిక శాతం మంది తగిన ఉద్యోగ అవకాశాలు లేక, ఆదాయ మార్గాలు ఏవీ కనిపించక.. ఏదో ఒక పని కోసం వెతుకుతూ ఉన్నారు..

ఈ స్థితిని OPEN UNEMPLOYMENT అని అంటారు.

ఆర్థిక రంగం కంటే విద్యా వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండటం వల్ల, ఈ రకమైన నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది.

2. DISGUISED UNEMPLOYMENT

పరిశ్రమల ఉత్పత్తి తక్కువగా ఉంటూ, వాటిలో పనిచేసే కార్మికులు, ఉద్యోగస్తుల సంఖ్య ఎక్కువైనట్లైతే ఆ పరిస్థితిని DISGUISED UNEMPLOYMENT అని అంటారు..

ఈ స్థితిలో కార్మికులు, ఉద్యోగస్తులు వారి శక్తానుసారం పనిచేస్తున్నా, వారికి అందే జీతభత్యాలు మాత్రం చాలిచాలనంతగా ఉంటాయి.

సాధారణంగా వ్యవసాయ రంగంలో ఈ రకమైన సమస్య కనబడుతుంది. ఇంటిల్లిపాదీ కష్టపడినా కూడా చేతికి తగినంత పంట రావడంలేదు.. 

3. SEASONAL UNEMPLOYMENT

చేతిలో పని ఉండి కూడా, ఏడాది పొడవునా చేయగలిగే అవకాశాలు లేకపోతే ఆ పరిస్థితిని SEASONAL UNEMPLOYMENT అని అంటారు. 

ఉదాహరణకు ఐస్ క్రీమ్ వ్యాపారస్తులు, బాణాసంచా తయారీదారులు మొదలైనవారికి, ఆయా ఉత్పత్తులకు తగినంత డిమాండ్ ఏర్పడినప్పుడు మాత్రమే పని ఉంటుంది.

ఏడాదిలో మిగతా సమయమంతా వీరు ఇతర పనులు వెదకడమో లేక ఖాళీగా ఉండటమో జరుగుతుంది.

4. CYCLICAL UNEMPLOYMENT

మార్కెట్లలో ఒక వస్తువుకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయినప్పుడు సదరు కంపెనీ నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది.. 

ఆ సమయంలో ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఆపడమో, లేదా తక్కువగా ఇవ్వవలసి ఉండటమో ఉంటుంది... 

ఇది సాధారణంగా భారీ ఉత్పత్తి రంగాల్లో తాత్కాలికంగా జరుగుతూ ఉంటుంది..

5. EDUCATED UNEMPLOYMENT

ఒక వ్యక్తి చదివిన చదువుకి, ఉన్న నైపుణ్యానికి, చేసే పనికీ సంబంధం లేకపోతే, ఆ పరిస్థితిని EDUCATED UNEMPLOYMENT అంటారు.

ఉదాహరణకు, ఇంజనీరింగ్ చదువుకున్న ఒక వ్యక్తి ఒక బ్యాంక్ క్లర్క్ గా చేయడం, Ph.D చేసిన వ్యక్తి స్కూల్ టీచర్ గా చేయడం లాంటివి..

విద్యావ్యవస్థ లోని లోపాలు, తగిన ఉద్యోగావకాశాలు లేకపోవడం, ఇంకా వ్యక్తిగత కారణాల వల్ల కూడా ఈ రకమైన నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. 

EDUCATED UNEMPLOYMENT ని UNDER EMPLOYMENT అని కూడా పిలవవచ్చు.

6. TECHNOLOGICAL UNEMPLOYMENT

రోజురోజుకూ సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడం వల్ల, ఉత్పత్తి రంగాల్లో పని అనుకున్నదానికంటే వేగంగా, సులువుగా మారింది. 

పది మంది వ్యక్తులు ఒక రోజులో చేసే పనిని, కేవలం ఒక్క గంటలో చేయగలిగే మెషీన్లు పుట్టుకొస్తున్నాయి.

ఈ కారణం వల్ల, నైపుణ్యం కలిగిన వ్యక్తులకు ఎటువంటి పనీ లేకుండా పోతోంది.. ఈ పరిస్థితిని TECHNOLOGICAL UNEMPLOYMENT అని అంటారు..

7.STRUCTURAL UNEMPLOYMENT

దేశంలోని ఆర్థిక వ్యవస్థ హఠాత్తుగా దెబ్బతిన్నట్లైతే, డిమాండ్ ఇంకా సప్లయ్ పూర్తిగా తగ్గిపోతాయి.. 

అలాంటి సమయంలో ఎందరో రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. దీన్నే STRUCTURAL UNEMPLOYMENT అంటారు.

సాధారణంగా ఇటువంటి పరిస్థితి యుద్ధాలు ఇంకా ఎమర్జెన్సీ సమయాల్లో ఏర్పడుతుంది.

8. CASUAL UNEMPLOYMENT

కాంట్రాక్టుల నిమిత్తం పనులు చేసేవారు, రోజు కూలి అర్జించేవారు, చెప్పులు కుట్టే వాళ్ళు, ఆటో డ్రైవర్లు మొదలైనవారు ఏరోజుకారోజు కష్టపడి సంపాదించుకోవలసి ఉంటుంది. 

ఇటువంటి వారి పరిస్థితిని CASUAL UNEMPLOYMENT అని అంటారు.

9. CHRONIC UNEMPLOYMENT

దేశంలో నిరుద్యోగ పరిస్థితులు సుదీర్ఘ కాలం కొనసాగుతూ, పేదరికంతో అధికశాతం మంది బాధపడుతూ ఉంటే, ఆ పరిస్థితిని CHRONIC UNEMPLOYMENT అని అంటారు.. 

జనాభా విపరీతంగా పెరిగిపోవడం, ఆర్థిక సంక్షోభం, కరువు వంటి కారణాల వల్ల ఈ రకమైన నిరుద్యోగ పరిస్థితి ఏర్పడుతుంది.

10. FRICTIONAL UNEMPLOYMENT

సంస్థలు, కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉండి, సరైన సమాచార మాధ్యమాలు, వసతులు లేక అర్హత కలిగిన వ్యక్తులు నిర్దేశించిన సమయంలో సదరు సంస్థలో చేరలేకపోయినట్లైతే, ఆ పరిస్థితిని FRICTIONAL UNEMPLOYMENT అంటారు.

ఈ రకమైన నిరుద్యోగ పరిస్థితి ప్రతీ దేశంలోనూ తాత్కాలికంగా ఏర్పడుతూ ఉంటుంది.


ఈ విధంగా నిరుద్యోగ సమస్య ఎన్నో విధలుగా దేశ ఆర్థిక రంగాన్ని దెబ్బ తీస్తూ ఉంటుంది. 

ప్రభుత్వాలు స్వయం ఉపాధి లేదా SELF EMPLOYMENT ని ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగాన్ని కొద్దివరకు నిర్మూలించవచ్చు..

 

Popular posts from this blog

What is Positive Thinking? (in Telugu) పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి?

What are Hormones? (in Telugu) హార్మోన్స్ అంటే ఏమిటి?

What is Habeas Corpus? (in Telugu) హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?