What is Reserve Bank of India? (in Telugu) • భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పనులు ఏమిటి?
రూపాయి... ఇది మనం బ్రతకడానికి ఉపయోగపడే ఒక కాగితపు నోటు మాత్రమే కాదు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా పేరు గడించిన మన Indian ఎకానమీకి కూడా ప్రాణమని చెప్పవచ్చు. అయితే, మనకి ప్రతి విషయంలోనూ అవసరమైన ఈ రూపాయిని దేశ నలుమూలలకీ ప్రవహింపచేసి మన ఆర్ధిక వ్యవస్థను బ్రతికించే గుండెకాయ ఏంటో తెలుసా? అదే RBI, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... భారతదేశంలో ఉండే బ్యాంకులన్నిటికీ రారాజు. మన చేతిలోకి వచ్చే ప్రతి కరెన్సీ నోటు పైనా, ఈ బ్యాంకు పేరుని చూడొచ్చు.
RBI యొక్క స్ట్రక్చర్, దాని పనితీరు, ఇంకా అది మన దేశ ఆర్ధిక వ్యవస్థ నిర్మాణానికి ఏ విధంగా తోడ్పడుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, కలకత్తా, చెన్నై, ఇంకా న్యూ ఢిల్లీ లో RBI కి విడివిడిగా 4 హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. RBI సెంట్రల్ ఆఫీస్ ముంబైలో ఉంది. ఇంకా దేశవ్యాప్తంగా 20 రీజియనల్ ఆఫీసులు, 11 సబ్ ఆఫీసులు ఉన్నాయి. RBI యొక్క దిశా నిర్దేశం చేయడానికి, దీనికి ఒక గవర్నర్, నలుగురు డిప్యూటీ గవర్నర్లు, Indian Ministry of Finance తరపున ఇద్దరు ప్రతినిధులు, పది మంది నామినెటెడ్ డైరెక్టర్లు, కేంద్ర ప్రభుత్వంచే నామినేట్ కాబడిన మరొక నలుగురు డైరెక్టర్లు ఉంటారు. Reserve Bank భారతదేశ కేంద్ర ప్రభుత్వం యొక్క నేతృత్వంలో ఉంటుంది. దేశంలో ప్రజలకు నేరుగా సేవలందించే SBI, UNION, AXIS మొదలైన బ్యాంకులు అన్నీ Reserve Bank of India కి ఖాతాదారులుగా ఉంటాయి.
సాధారణంగా మనకి ఎప్పుడైనా డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకుకి వెళ్లి అప్పు తీసుకుంటాం. కొన్ని సార్లు బ్యాంకులకు కూడా కష్టసమయాలు తప్పవు. అలాంటి పరిస్థితుల్లో RBI వాటికి ఆర్ధిక సహకారాన్ని అందిస్తుంది. అందుకే RBI ని 'బ్యాంకర్స్ బ్యాంక్' అని కూడా పిలుస్తారు. బ్యాంకులు ఇచ్చే లోన్లకు లేదా రుణాలకు వడ్డీ రేట్లను నిర్ణయించే హక్కు కూడా RBI కి మాత్రమే ఉంది. బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు వాటి ఇష్టానుసారం పనిచేసే అవకాశం లేకుండా RBI వాటికి షరతులు ఇంకా పరిమితులు విధిస్తుంది.
దేశంలో ఉండే ప్రతి పౌరుడూ సులభంగా తనకి నచ్చిన బ్యాంకుకి వెళ్లి, తనకు అవసరమైన FINANCIAL SERVICES లేదా వివిధ రకాల ఆర్ధిక సేవలు అతి తక్కువ ఖర్చుతో పొందే వీలుండేటట్లు RBI చర్యలు తీసుకుంటుంది. దేశంలో పేద, ధనిక వంటి ఆర్ధిక బేధాలను నిర్మూలించడానికి, వ్యాపార-వాణిజ్య సంస్థల నుండీ బ్యాంకులు అధిక మొత్తంలో వడ్డీలను వసూలు చేసేలా, ఇంకా పేద రైతులకు, చిరు వ్యాపారులకూ తక్కువ వడ్డీతో రుణాలను అందించేలా RBI సూచిస్తుంది. ఆర్ధికంగా వెనుకబడిన ప్రజలకు బ్యాంకుల నుండి మరింత ఆర్ధిక సహకారం అందేలా RBI వాటికి వివిధ సూచనలు ఇస్తుంది. ఈ రకంగా దేశ ఆర్ధిక వ్యవస్థను RBI బలంగా తయారుచేస్తుంది.
ఇది మార్కెట్లోని ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటికి తగ్గట్టుగా దేశంలో డబ్బు యొక్క సరఫరాని లేదా మనీ సర్క్యూలేషన్ని నియంత్రిస్తుంది. మనం తరచుగా వాడుతున్న PhonePe, PayTM వంటి UPI నగదు చెల్లింపు వ్యవస్థల్ని నిలకడగా ఇంకా సురక్షితంగా ఉండేలా చేసి, ఎప్పటికప్పుడు వీటిని గమనించే బాధ్యత కూడా RBI తీసుకుంటుంది. విదేశాల నుండి మన దేశానికి వచ్చిన కరెన్సీని, ఇంకా డాక్యూమెంట్లను RBI తన ఆధీనంలో ఉంచుతుంది. ఈ నిల్వలను, FOREX RESERVES అని అంటారు. విదేశీ కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి ఎంత వెలువైనదో తెలుపడానికి FOREIGN EXCHANGE RATE అనే సూచీ ఉంటుంది. ఈ సూచీని కూడా RBI నిర్దేసిస్తుంది..
ఇలా RBI కోసం చెప్పుకోడానికి చాలా విషయాలు ఉన్నాయి... ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, మన దేశానికి ఒకప్పుడు ప్రధాన మంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆ పదవిలోకి రాకముందు 1982-86 మధ్యకాలంలో RBI కి గవర్నర్ గా సేవలందించారు. RBI కి గవర్నర్ గానూ, ఇంకా దేశ ప్రధాన మంత్రిగానూ సేవలందించిన ఒకేఒక్క వ్యక్తిగా, మన్మోహన్ సింగ్ చరిత్రలో స్థానాన్ని సంపాదించారు.